SRH vs RCB: Virat Kohli took to Twitter to share a group photograph with his Royal Challengers Bangalore squad after their IPL 2020 campaign ended on Friday.
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#Ipl2020
#AbDevilliers
#DevduttPadikkal
#Siraj
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో తొలి అర్ధభాగం అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా ఓ భావోద్వేగ సందేశం ఇచ్చాడు. ఐపీఎల్ 2020లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు.